వ్యక్తి ప్రాణం తీసిన రెండు రూపాయల గొడవ

వ్యక్తి ప్రాణం తీసిన రెండు రూపాయల గొడవ

person-died

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. రెండ్రూపాయల దగ్గర తలెత్తిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది.. కాకినాడ రూరల్‌ మండలం వలసపాకలలో ఈ ఘటన చోటు చేసుకుంది..

వలసపాకల కూడలిలో సైకిల్‌కు గాలి కొట్టించుకునేందుకు సువర్ణరాజు అనే వ్యక్తి పక్కనే ఉన్న సైకిల్‌షాప్‌కు వెళ్లాడు.. గాలికొట్టించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వాలని షాపు నిర్వాహకుడు కోరడంతో ఎదురు తిరిగాడు. సైకిల్‌ షాప్‌ ఓనర్‌ సాంబపై దాడిచేశాడు.. దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది.. మధ్యలో తలదూర్చిన సాంబ స్నేహితుడు అప్పారావు.. సువర్ణరాజుపై కత్తితో దాడిచేశాడు.. విచక్షణా రహితంగా పొడిచాడు.

అప్పారావు దాడిలో తీవ్ర గాయాలపాలైన సువర్ణరాజు అక్కడికక్కడే కుప్పకూలాడు.. స్థానికులు అతన్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సువర్ణరాజు చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story