బీభత్సం సృష్టించిన బుల్‌బుల్ తుపాన్

బుల్‌బుల్ తుపాన్ బంగ్లాదేశ్‌లో బీభత్సం సృష్టించింది. సైక్లోన్ ప్రభావంతో బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. వర్షాలు-గాలుల ధాటికి పెద్ద పెద్ద చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు 8 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. 950 సెల్‌టవర్లు కూలిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
కోల్‌కతాతో పాటు హుగ్లీ, హవ్‌డా, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీ టర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోల్‌కతాలో చెట్లు కూలిపోయాయి. హోంర్డింగులు విరిగిపడ్డాయి. కుండపోత వానల కారణంగా కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేశారు. తీర ప్రాంతాల్లో పరిస్థితి ప్రమాద కరంగా ఉండడంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఒడిశాలో తుపాను ప్రభావం బలంగానే ఉంది. భద్రక్ జిల్లాలోని ధర్మాలో రికార్డుస్థాయిలో గంటలకు 110 కిలోమీటర్లవేగంతో గాలులు వీచాయి. కేంద్రపరా, జగత్‌సింగ్‌పూర్, భద్రక్ జిల్లాల్లో భారీగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరెంట్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com