మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహా డ్రామా..

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహా డ్రామా..
X

Maharastra

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహా డ్రామా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి గవర్నర్ ఆహ్వానం పంపడాన్ని శివసేన స్వాగతించింది. కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల ముందు బీజేపీ-శివసేన కూటమిగా, కాంగ్రెస్‌-ఎన్సీపీ మరో కూటమిగా ఏర్పాటైన విషయాన్ని వాళ్లు గుర్తుచేస్తున్నారు. అతిపెద్ద కూటమి సర్కారును ఏర్పాటు చేసేందుకు ముందుకు రానప్పుడు.. రెండో కూటమిని ఆహ్వానించాలి కదా అంటూ వాగ్బాణాలు సంధిస్తున్నారు.

మరోవైపు... గవర్నర్ ఆహ్వానంపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఫిఫ్టి-ఫిఫ్టి ఫార్ములాపై శివసేన పట్టు వీడకపోవడం వాళ్లను కంగారుకు గురిచేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అసెంబ్లీలో బలనిరూపణ ఎలా సాధ్యమని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది స్వతంత్రులు ఆ పార్టీకి మద్దతిస్తున్నా.. వారి సపోర్టుతో మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోవడం కష్టమని బీజేపీకి తెలుసు. దీంతో.. కోర్‌ కమిటీ రంగంలోకి దిగుతోంది. కోర్‌ గ్రూప్‌లో చర్చించిన తర్వాత మహారాష్ట్రపై బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటు.. శివసేన విషయానికి వస్తే.. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి శివసేన లీడరే అంటూ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. తమ వ్యూహం ఏమిటన్నది మాత్రం బయట పెట్టడం లేదు. గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

Tags

Next Story