కర్ణాటకలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం

కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. శాసనసభ ఉప ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 15 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. 9న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం తో ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.
జూలై-ఆగస్టు నెలల్లో కర్ణాటక రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రిజైన్ లెటర్లు పంపించారు. ఐతే, నాటి స్పీకర్ రమేష్ కుమార్, రాజీనామాలు ఆమోదించలేదు. 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 15 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక, అనర్హత వేటుతో ఖాళీగా మారిన 15 సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని తాజాగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com