మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు.. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు ఆహ్వానం

మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు.. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు ఆహ్వానం
X

sivasena

మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కు శివసేనకు ఆహ్వానం లభించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కోషియారీ, శివసేనకు ఆహ్వానం పంపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సోమవారం రాత్రి ఏడున్నర గంటల లోపు బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ కోషియారీ చట్టబద్దంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా, అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఆహ్వానించారు. బీజేపీ ముందుకు రాకపోవడంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను పిలిచారు. శివసేన క్లైయిమ్ చేసుకుంటుందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.

మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. బీజేపీ 105 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన-56, ఎన్సీపీ-54, కాం గ్రెస్-44 సీట్లు గెలుచుకున్నాయి. ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందారు.

Tags

Next Story