చిన్న నిర్లక్ష్యానికి ఒకే కుటుంబంలోని ముగ్గురు బలి..

చిన్న నిర్లక్ష్యం.. ఒకే కుటుంబంలోని ముగ్గురిని బలి తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు, కూతురు తనువు చాలించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురి మృతి అంతులేని ఆవేదనను మిగిల్చింది.
చిత్తూరు జిల్లా పెనుమూరులో లారీని టూ వీలర్ ఓవర్ టేక్ చేయబోయి చక్రాల కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. తిరుపతికి చెందిన 35 ఏళ్ల జీవనకోటితోపాటు అతడి కూతురు, కుమారుడు కూడా మృతి చెందారు. తన ఇద్దరి పిల్లలను తాత దగ్గరకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. రోదనలతో ఆ ప్రాంతం మారుమోగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా... తాజా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు జిల్లా వాసులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com