నిఘా సంస్థల హెచ్చరిక.. ముష్కరమూకలు విరుచుకుపడే ప్రమాదం!

అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు తెగబడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడవచ్చని మిలిటరీ ఇంటెలిజెన్స్, రా, ఐబీ వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. దాడులకు సంబంధించి టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు పక్కా ప్రణాళిక రచిస్తున్నాయని నిఘా సంస్థలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో దాడులు జరిగే ప్రమాదముందని సూచించాయి. ఈ హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రమూకల టార్గెట్లను గుర్తించి దాడులను నిరో ధించడానికి చర్యలు చేపట్టారు.
దేశంలో మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదులు చేయని ప్రయత్నం లేదు. సరిహద్దులు దాటి కశ్మీర్‌లోకి చొర బడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రముప్పు పెరిగిపోయింది. ఐతే, టెర్రరిస్టుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న నిఘా సంస్ధలు, అంతేవేగంగా సమాచారాన్ని సైన్యానికి చేరవేస్తున్నాయి. దాంతో ఉగ్రవాదులను భద్రతాబలగాలు ఎప్పటి కప్పుడు ఏరివేస్తున్నాయి. తాజాగా, అయోధ్య తీర్పు నేపథ్యంలో ముష్కరమూకలు విరుచుకుపడే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భావిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com