ఆర్టీసీ సమ్మె.. 5100 రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఆర్టీసీ సమ్మె.. 5100 రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

tsrtc-hc

ఆర్టీసీ సమ్మెపై సోమవారం మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. కార్మికుల డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకోని.. సమస్య పరిష్కారం చూపాలని గతంలోనే హైకోర్టు సూచించింది. దీంతో హైకోర్టుకు మరోసారి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది. విలీనంపై మొండి పట్టు ఉంటే చర్చలు సాధ్యం కాదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ కోలుకోలేని విధంగా తీవ్ర అప్పుల్లో ఉందని, రూ. 47కోట్లు చెల్లించిన మాత్రాన ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు తొలిగిపోవని ప్రభుత్వం వాదిస్తోంది.

గతంలో ఆర్టీసీ రక్షణ చర్యలు చేపట్టామని, ప్రస్తుతం ఇబ్బందుల దృష్ట్యా బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం కేటాయించలేకపోతున్నామన్న ప్రభుత్వం చెబుతోంది. చట్ట విరుద్ధంగా ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు దిగాయంటూ వాదిస్తోంది. సాధ్యంకాని డిమాండ్లపై చర్చలు జరిపినా ఉపయోగం ఉండదని ప్రభుత్వం పేర్కొంది.

కోర్టులో కేసు విచారణ ఉండగానే కార్మిక జేఏసీ అత్యవసరంగా చలో ట్యాంక్‌బండ్ నిర్వహించారని చెబుతుండగా, తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న కార్మికులపై లాఠీలతో పోలీసులు దాడి చేశారన్న ఆర్టీసీ జేఏసీ వాదిస్తోంది. చలో ట్యాంక్‌బండ్‌ విషయంలో కార్మికులు, ప్రభుత్వం విడివిడిగా అఫిడవిట్ దాఖలు చేశారు.

5100 రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags

Next Story