ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 58 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఢాకా-బౌండ్ ఇంటర్‌సిటీ రైలు.. చిట్టగాంగ్‌కు వెళ్లో లోకోమోటివ్ రైలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. కస్బా పట్టణంలోని మొండోల్‌బాగ్ స్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మూడు రైలు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు.
సిగ్నల్ తప్పిదం వల్లే రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. అటు ప్రమాదంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై బంగ్లాదేశ్ రైల్వే శాఖ దర్యాప్తుకు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com