అయోధ్య, వారణాసిలో కార్తీక పౌర్ణమి శోభ

అయోధ్య, వారణాసిలో కార్తీక పౌర్ణమి శోభ
X

karthika-pournami

అయోధ్యలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. సరయూ నది భక్త జన సందోహంగా మారింది. తెల్లవారు జామునే సరయూ నది ఒడ్డుకు చేరుకున్న లక్షలాది మంది భక్తులు.. పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

అటు వారణాసిలోనూ కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. గంగా నదిలో ఉదయాన్నే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శివనామస్మరణతో గంగా తీరం మారు మోగింది. వారణాసిలో ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Tags

Next Story