నిలకడగా లతామంగేష్కర్ ఆరోగ్యం

తీవ్ర అస్వస్థతకు గురైన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కోలుకుంటున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆమెను హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మంగళవారం డిశ్చార్జ్ అవుతారని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు.
వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగానే లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపు శ్వాత తీసుకోలేకపోయారని కుటుంబ సభ్యులు చెప్పారు. లతా మంగేష్కర్ వయసు 90 ఏళ్లు. సెప్టెంబర్ 28న 90వ పుట్టినరోజు జరుపుకున్నారు.
అశుతోష్ గోవార్కర్ చిత్రం పాని పట్‌లో లతా మేనకోడలు పద్మిని కొల్హాపురి నటించింది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను లతా ట్వీట్ చేశారు. పద్మినితో పాటు పానిపట్ సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు గురయ్యారన్న వార్త అభిమానుల్లో కలవరాన్ని కలిగించింది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com