పెన్షన్ ఆపేస్తే పెట్రోల్ పోస్తా.. : మహిళ

పెన్షన్ ఆపేస్తే పెట్రోల్ పోస్తా.. : మహిళ
X

atp-lady

అనంతపురం జిల్లా కుడేరు మండలంలోని MPDO కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పెన్షన్ విషయంలో పంచాయతీ కార్యదర్శితో గొడవ పడ్డారు. గ్రామంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తుండగా.. అక్కడకు వచ్చిన శివమ్మ, ఓబులేసు గ్రామ కార్యదర్శి మురళీకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. తమ పెన్షన్ ఆపేస్తే పెట్రోల్ పోసి చంపేస్తామంటూ అతన్ని బెదిరించారు. చేతిలో వేట కొడవలితో శివమ్మ.. అక్కడికి రావడంతో చుట్టుపక్కలవాళ్లు వెంటనే అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లొచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story