అలా చేస్తే.. మేం వీధిన పడతాం: రైతులు

అలా చేస్తే.. మేం వీధిన పడతాం: రైతులు
X

is

అనంతపురం జిల్లా బొమ్మనహల్‌ మండలం కోలాగానహళ్లి రైతులు ఆందోళనకు దిగారు. వేదావతి చిన్నహగరిలో ఇసుక రీచ్‌ ఏర్పాటు చేయరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌ను గుర్తించడానికి వచ్చిన మైన్స్‌ అండ్‌ జువాలజీ, నీటిపారుదల శాఖ అధికారులను రైతులు అడ్డుకున్నారు. వేదావతి హగరి పరిహహక ప్రాంతంలో వందలాది మంది చిన్న సన్నకారు రైతులమంతా వ్యవసాయ బోర్ల మీదే ఆధారపడి పంటలు పండిస్తున్నామని అన్నారు.

తమ ప్రాంతంలో ఇసుకు రీచ్‌ ఏర్పాటు చేస్తే భూగర్బ జలాలు అడుగంటిపోయి తాము వీధిన పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వేరే ప్రాంతంలో ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారుల వాహనాల ముందు రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో అధికారులు వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Tags

Next Story