హీరో రాజశేఖర్‌కి రోడ్డు ప్రమాదం

హీరో రాజశేఖర్‌కి రోడ్డు ప్రమాదం
X

acc

హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండ వద్ద రహదారి డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి కారు బొల్తా కొట్టింది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాజశేఖర్ తో పాటు మరో వ్యక్తి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం అనంతరం రాజశేఖర్ మరో కారులో అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

రాజశేఖర్ కారు.. ప్రమాదంలో తుక్కుతుక్కు అయిపోయింది. ముందుభాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. యాక్సిడెంట్ తర్వాత కార్ షేప్ చూస్తే చూస్తుంటేనే ఒక్కసారి ఒళ్లు జలదరించేలా ఉంది. భద్రతపరంగా చూస్తే కాస్త హైఎండ్ కార్ కావడం వల్ల అందులో ఉన్న ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. TS 07 FZ 1234 కారు డివైడర్‌ను ఢీకొట్టిన స్పీడ్‌కి ముందు చక్రం విరిగిపోయింది. ఈ కారుపై ఇప్పటికే 3 ఓవర్ స్పీడ్‌ చలాన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. రాత్రి ప్రమాదం జరిగినప్పుడు కారు 180 స్పీడ్‌లో ఉందని పోలీసులు చెప్తున్నారు. అలాగే కారులో 2 మద్యం బాటిళ్లను కూడా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు కారు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

Tags

Next Story