రాజశేఖర్ పై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు

రాజశేఖర్ పై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు

rajasekar

అవుటర్ రింగ్ రోడ్డు పై హిరో రాజశేఖర్ కారు నిన్న అర్దరాత్రి ప్రమాదానికి గురైంది.శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద గోల్కొండ orr పై అతివేగంగా వచ్చిన అతని కారు బోల్తా కొట్టింది. అయితే కారులోని బెలుల్స్ ఓపన్ కావడంతో అతను స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.దాని పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.అయితే పోలీసులకు మాత్రం షాక్ గురైయ్యారు 2018-19 సంవత్సరానికి గాను మొత్తం 20 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు అయ్యారు.

2018లో రాచకొండ,సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 17 చలాన్లు నమోదు అయ్యాయి.ఈ సంవత్సరం రాచకొండలో1కేసు సైబరాబాద్ లో 3 కేసులు నమోదయ్యాయి.అయితే ఈ విషయం పై పోలీసులు సీరియస్ గా ఉన్నారు.20 పైగా కేసులు బుక్ అయినప్పటికి డ్రైవింగ్ లో ఏలాంటి మార్పులేదని పోలీసులు అంటున్నారు.నిన్న జరిగిన ప్రమాదంలో రాజశేఖర్ పై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు అతనికి నోటీసు ఇవ్వనున్నారు.అతని దగ్గర నుంచి స్టేట్ మెంట్ తీసుకున్న తరువాత అతని లైసెన్స్ రద్దు చేసే అలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story