ఆర్టీసీ చట్టం కేంద్ర చట్టంలో భాగమే : హైకోర్టు

ఆర్టీసీ చట్టం కేంద్ర చట్టంలో భాగమే : హైకోర్టు

hc

ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది హైకోర్టు. అటు రూట్ల ప్రైవేటీకరణపై మాత్రం గురువారం మరోసారి వాదనలు విననుంది. సమ్మె వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు సూచించిన.. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ప్రతిపాదనకు విముఖత వ్యక్తం చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని పేర్కొంది. హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందు వల్లే లేబర్‌కోర్టుకు వెళ్లలేదని న్యాయస్థానానికి నివేదించింది ప్రభుత్వం..తుదపరి చర్యలు చేపట్టేలా కార్మికశాఖ కమిషనర్‌ను ఆదేశించాలని హైకోర్టును కోరింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. అయితే ఎస్మా ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని అడ్వకేట్‌ జనరల్ వాదించారు. చట్టవిరుద్ధమని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఈ సందర్భంగా ఏజీ ప్రస్తావించారు. ఎస్మాపై 2015లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 6 నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు జీవో పొడిగిస్తారని పేర్కొన్నారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన జీవో నెం.180ని కూడా ఏజీ ప్రస్తావించారు. అయితే 1988లో తీసుకొచ్చిన జీవో తెలంగాణకు వర్తించదని హైకోర్టు తెలిపింది. పునర్విభజన చట్టం సెక్షన్- 68 ప్రకారం... పబ్లిక్ యుటిలిటీ సర్వీసులు ఎస్మా పరిధిలోకి వస్తాయని ఏజీ వాదనలు వినిపించారు.

పునర్విభజన చట్టంలోని సెక్షన్-3 ప్రకారం TSఆర్టీసీని ఏర్పాటు చేశామని ఏజీ వివరించారు. అయితే సెక్షన్-47 ప్రకారం కేంద్రం అనుమతి అవసరం కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం అనుమతి తప్పనిసరి కాదని, రోడ్డు రవాణాపై రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని ఏజీ తెలిపారు..రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టీసీ చట్టం కేంద్ర చట్టంలో భాగమేనన్న న్యాయస్థానం..తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story