విజయవాడలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఆదమరిస్తే అంతే..

విజయవాడలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఆదమరిస్తే అంతే..
X

cyber-crime

విజయవాడ కమిషనరేట్ పరిదిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలే టార్గెట్‌గా మోసాలకు తెగబడుతున్నారు కేటుగాళ్లు. బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత సమాచారాన్ని చోరీలు చేస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ ఏడాది 181 సైబర్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, బీహార్, రాజస్థాన్, ఝార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. . రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు బెజవాడ పోలీసులు సవాల్‌గా మారింది. అపరిచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ , ఓటీపీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

Tags

Next Story