స్వచ్ఛంద రక్తదాన ఉద్యమానికి 14 ఏళ్లు..ఫ్రెండ్స్‌ టు సపోర్ట్‌

స్వచ్ఛంద రక్తదాన ఉద్యమానికి 14 ఏళ్లు..ఫ్రెండ్స్‌ టు సపోర్ట్‌
X

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలనే ఆలోచన ఎంతో ఉన్నతమైనది. కానీ ఆ పని చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మెరుగైన వైద్య సేవలు అందాలి. అందుకే.. స్వచ్ఛంద రక్తదాతలను మరింత ప్రోత్సహించేందుకు అతి పెద్ద స్వచ్ఛంద రక్తదాతల వెబ్‌సైట్ friends2support.org మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెడీజ్ అనే సంస్థతో కలిసి తమ వెబ్‌సైట్ లోని రక్తదాతలందరికీ హెల్స్ అసిస్టెన్స్ అందిస్తోంది.

హెల్త్‌ అసిస్టెన్స్ అంటే ఏంటి ?

హెల్త్ ఇన్స్యూరెన్స్ అందించే సంస్ధలు మీరు చాలానే చూసి ఉంటారు. కానీ ఏ డాక్తర్ దగ్గరికి వెళ్ళాలి? వారిని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే అంశాల్లోనే చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మెడీజ్ సరిగ్గా ఈ పనే చేస్తోంది. సంస్ధలోని రక్తదాతలు అందరికీ డెడికేటెడ్‌గా హెల్త్ మేనేజర్ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ హాస్పిటల్ లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లాంటి సలహాలూ సూచనలు ఇవ్వడంతో పాటు బిల్లులో డిస్కౌంట్ అందిస్తారు. ప్రస్తుతానికి హైదరాబాద్లోని డోనార్స్ కి ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అతి త్వరలో అందరికీ దీన్ని అందించబోతున్నారు.

ఫ్రెండ్స్ టు సపోర్ట్.. మెడీజ్ కలిసి చేస్తున్న ప్రయత్నం.

ఎంతో మందికి రక్తదానం చేయాలని ఉంటుంది. కానీ ఏదోక ఆరోగ్య సమస్య వల్ల వెనకాడుతూ ఉంటారు. ఇకపై తమ సంస్ధలోని స్వచ్చంద రక్తదాతలు ఎవరికీ ఈ సమస్య రాకూడదన్నది friends2support.org ప్రయత్నం. అందులో భాగంగానే సంస్ధలోని రక్తదాతలు అందరికీ ఉచిత వైద్య సలహాలు అందించాలని సంకల్పించింది. దీనికి మెడీజ్ తమ వంతుగా సహాయం అందించడానికి ముందుకొచ్చింది. గత 14 సంవత్సరాలుగా తమ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా రక్తదాతలని ప్రోత్సహిస్తూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందించేందుకు తమ వంతు కృషి చేస్తోంది friends2support.org సంస్థ . 14 నవంబర్‌ .. సంస్థ యొక్క వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాతలందరిని మరింత ప్రోత్సహించేందుకు మెడీజ్‌తో కలిసి ఫ్రెండ్స్ 2 సపోర్ట్ పని చేస్తోంది. తమ రక్తదాతలందరికి మేడీజ్ సంస్థ వారి హెల్త్ అసిస్టెన్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందించేందుకు ఒక పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు సంస్థ ఫౌండర్ శ్రీ ఎస్‌.కె షరీఫ్ చెప్పారు. ఇప్పటిదాకా వేలాదిమందిని ఆదుకున్న తమ సంస్ధలోని స్వచ్చంద రక్తదాతలు అందరూ ఇకపై ఆరోగ్యంగా ఉండాలని, సామాజిక బాధ్యతను నెరవేర్చాలని షరీఫ్ అన్నారు.ఈ సందర్బంగా ఈరోజు బేగంపేట్ లోని మేడీజ్ సంస్థ కేంద్ర కార్యాలయంలో ఒక కార్యక్రమంలో రెండు సంస్థల ప్రతినిధులు పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో F2S సంస్థ వ్యవస్థాపకులు శ్రీ షరీఫ్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న తమ రక్తదాతలందరికి వారి కుటుంబ ఆరోగ్యం సులభ నిర్వహణ కోసం మేడీజ్ సంస్థ వారు ఉచిత సభ్యత్వాన్ని కల్పించడంపై హర్షాన్ని వ్యక్తం చేశారు.అలాగే మేడీజ్ సంస్థ ప్రతినిధి డా. సురేష్ బాబు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేస్తున్న F2S సంస్థ వారి రక్తదాతలందరికి తమ సభ్యత్వాన్ని అందించటం తమకెంతో గర్వకారణమని చెప్పారు.

Next Story