ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో నర్సింగ్ కోర్సు.. దరఖాస్తులు ప్రారంభం..

ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో నర్సింగ్ కోర్సు.. దరఖాస్తులు ప్రారంభం..

nursing

ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలోని 'ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్' 2020 విద్యాసంవత్సరానికి గానూ అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత ఉండి.. 25 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

కోర్సు: బీఎస్సీ నర్సింగ్

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్థిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు: 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.10,1995-30.09.2003 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా

ఎంపిక విధానం : ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి మిలిటరీ నర్సింగ్ సర్వీసుల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: రూ.750

ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ విడుదల: 09.11.2019.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.11.2019.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.12.2019 (సా. 5.00 గం.).. పరీక్ష తేదీ: 2020 జనవరి రెండో వారంలో.. ఫలితాల వెల్లడి: 2020 మార్చి చివరి వారంలో.. ఇంటర్వ్యూ: 2020 మే మొదటి వారంలో.

Read MoreRead Less
Next Story