ఇండోర్ టెస్టులో ఇరగదీసిన టీమిండియా

ఇండోర్ టెస్టులో ఇరగదీసిన టీమిండియా

cricket

ఇండోర్ టెస్టులో టీమిండియా ఇరగదీసింది. తొలిరోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది. విజృంభించిన పేసర్లు..తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 150 పరుగులకే ఆలౌట్‌ చేశారు.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 64 పరుగుల వెనుకంజలో ఉంది. పుజారా 43, మయాంక్ అగర్వాల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ ఈసారి విఫలం అయ్యాడు... 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు..

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాకు టీమిండియా పేసర్లు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులతో వరుసగా వికెట్లు తీశారు..మహ్మద్ షమి రివర్స్‌స్వింగ్‌కి బంగ్లా బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. షమి మూడు వికెట్లు తీయగా..ఇషాంత్ శర్మ , ఉమేశ్ యాదవ్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు.

Tags

Read MoreRead Less
Next Story