బాగానే ఉన్నా.. ఏమీ అవసరం లేదు : చంద్రబాబు

విజయవాడ ధర్నాచౌక్‌లో ఇసుక దీక్ష చేస్తున్నటీడీపీ అధినేత చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు చేశారు. షుగర్, బీపీ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. మంచినీళ్లు తాగాలని సూచించారు. తాను బాగానే ఉన్నానని, ఏమీ అవసరం లేదని చంద్రబాబు, వైద్యులకు చెప్పారు. దీక్ష చేస్తున్న వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వైద్యులు ప్రభుత్వ వర్గాలకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందులోభాగంగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు.
ఎపీలో ఇసుక సంక్షోభాన్ని నిరసిస్తూ..విజయవాడ ధర్నా చౌక్‌లో ఉదయం 8 గంటల నుంచి దీక్ష చేస్తున్నారు చంద్రబాబు. ఇది రాత్రి 8 గంటల వరకూ కొనసాగనుంది..ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించడం, పనులు లేక చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం, ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు 10వేల చొప్పున భృతి అందివ్వాలన్న మూడు ప్రధాన డిమాండ్లతో చంద్రబాబు దీక్ష చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com