అందమైన జంట అందాల సౌధం.. జస్ట్ రూ.144 కోట్లు..

అందమైన జంట అందాల సౌధం.. జస్ట్ రూ.144 కోట్లు..

priyanka

అటు హాలీవుడ్‌లో, ఇటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుని ఇల్లాలైంది. ఇప్పటివరకు లాస్ ఏంజిల్స్‌లోని బెవెర్లీ హిల్స్‌లో ప్రియాంక, నిక్‌ల జంట ఉంటున్నారు. ఇప్పడు దీన్ని అమ్మేసి ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. అది కూడా లాస్ ఏంజిల్స్‌లోని ఎన్సివో ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఇల్లుని ఈ జంట కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 20 వేల చదరపు అడుగులు గల ఈ ఇంటి విలువ ఏకంగా దాదాపు రూ.144 కోట్లు (20 మిలియన్లు). ఈ ఇల్లు కొనడం కోసం నిక్ ఆగస్టులో తన బ్యాచిలర్ హౌస్‌ను అమ్మేసినట్లు సమాచారం. కొత్త ఇంటి కొనుగోలుతో లాస్ఏంజెల్స్‌లోని స్థానిక రియల్ ఎస్టేట్ రికార్దులను ప్రియాంక-నిక్ జంట బద్దలు కొట్టినట్లు సమాచారం.

ఇక ఈ ఇంటిలో 7 బెడ్ రూమ్‌లు, 11 బాత్ రూమ్‌లు, ఇంటి ముందు విశాలమైన స్థలంతో పాటు అత్యాధునికమైన వసతులతో కూడిన సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఇంటికి దగ్గరలోనే నిక్ సోదరుడు జో జోనస్ రూ.101 కోట్లు పెట్టి వాళ్లు కూడా ఇల్లు కొనుగోలు చేశారు. ఇల్లు కొనుక్కోవాలన్న ప్రియాంక కల నెరవేరింది. ఇక పిల్లలను కనడమే తరువాయి. ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక.. ఇల్లు, పిల్లలు.. ఇది నా డ్రీమ్ అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, 'స్కై ఈజ్ పింక్' చిత్ర విజయాన్ని అందుకున్న ప్రియాంక ప్రస్తుతం రాజ్ కుమార్ రావుతో 'వైట్ టైగర్' చిత్రంలో నటిస్తోంది.

Read MoreRead Less
Next Story