రాఫెల్ వివాదంలో మోదీ ప్రభుత్వానికి ఊరట


రాఫెల్‌పై రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. రివ్యూ పిటిషన్లలో ఎలాంటి బలమైన వాదన లేదన్న సుప్రీం.. రాఫెల్‌పై సీబీఐ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే గతంలో తీర్పు వెల్లడించామని.. దీనిపై ఇంకా విచారణ అవసరమేంటని ప్రశ్నించింది. రాఫెల్‌పై సుప్రీం పర్యవేక్షణలో విచారణ అక్కర్లేదని కూడా తేల్చి చెప్పింది.
36 రాఫెల్ విమానాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని విపక్షాల ఆరోపించాయి. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాటిపై సుదీర్ఘ విచారణ అనంతరం 2018 డిసెంబర్ 14న పిటిషన్లు కొట్టేసింది. అయితే ప్రభుత్వ వాస్తవాలను దాచిపెట్టి.. కోర్టును తప్పుదోవ పట్టించిందని.. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా వీటిని కోర్టు కొట్టివేయడంతో మోదీ ప్రభుత్వానికి ఊరల లబించింది.
అటు రఫేల్ వివాదంలో రాహుల్ గాంధీ చేసిన 'చోర్' లాంటి వ్యాఖ్యలపైనా సుప్రీంకోర్టు సున్నితంగా మందలించింది. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేయకూడదని సూచించింది. చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణలు మన్నించినా.. ఇకపై నోరు జారొద్దని.. వివాదాన్ని ఇంతటితో ముగించాలని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

