పంటపొలాల మధ్య అందాల తారల ఫ్లెక్సీలు

పంటపొలాల మధ్య అందాల తారల ఫ్లెక్సీలు

flexi

పంటపొలాలను కాపాడుకునేందుకు రైతులు కొత్త ఆలోచన చేస్తున్నారు. పుర్రెకో బుద్ధి అన్నట్టు జగిత్యాల జిల్లాలో వినూత్నంగా ముందుకెళ్తున్నారు. పంటపొలాల మధ్య అందాల బొమ్మలు పెడుతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా, ఐటెమ్ సాంగ్‌ల ముమైత్‌ఖాన్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రాయపట్నం జాతీయ రహదారి పక్కన ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి.

పంటపొలాల మధ్య గతంలో గడ్డిబొమ్మలు, దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు రైతులు రూటు మార్చారు. దిష్టిబొమ్మలకు పశువులు, పక్షులు బెదరడం లేదని.. గ్లామరస్ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ధర్మపురి ఏరియాలో ఈ ట్రెండ్ నడుస్తోంది. కొత్తరకం ఫ్లెక్సీలను చూసి పక్షులు బెదిరిపోతున్నాయట. మరోవైపు.. ఈ ఫ్లెక్సీలను చూస్తూ జనం కూడా కాసేపు ఆగుతున్నారు. ఆ రకంగా తమ పంటలకు రక్షణ దొరుకుతోందని రైతులు చెప్తున్నారు.

పంటలను కాపాడుకునేందుకు సినీ గ్లామర్ అద్దుతున్న రైతులు.. పొలానికి చీర కడుతున్నారు. రంగురంగుల చీరలు ఏర్పాటు చేస్తున్నారు. అవి గాలివాటాన్ని కొంత నియంత్రిస్తుండగా.. వాటిని వింతగా చూస్తూ అటువెళ్లే జనం ఆగుతున్నారు. దీంతో.. పశువులు, పక్షులు పొలం వైపు రావడం తగ్గింది. దీంతో.. రైతులు తమ వినూత్న ప్రయత్నం ఫలించిందని సంతోష పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story