భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా

ఇండోర్ టెస్టులో టీమిండియా హవా కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో మన బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. బంగ్లా బౌలర్లను ఆటాడుకున్నారు..ఆటముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. 330 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 28 ఫోర్లు, 8 సిక్సర్లతో 243 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 343 పరుగుల ఆధిక్యంలో ఉంది..
రెండోరోజు ఆటలో మయాంక్ అగర్వాల్ బ్యాటింగే హైలెట్. చతేశ్వర్ పుజారా 54, రహానే 86 రన్స్‌తో రాణించారు..అయితే కెప్టెన్ కోహ్లీ డకౌట్‌తో నిరాశపరిచాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 12 పరుగులు మాత్రమే చేశారు.రవీంద్ర జడేజా 60, ఉమేశ్ యాదవ్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అబు జాయెద్ 4 వికెట్లు పడగొట్టగా, ఇబాదత్ హొసైన్, మెహిదీ హసన్ చెరో వికెట్ తీసుకున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com