డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన పవన్

డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన పవన్
X

pawan-kalyan

ఏపీలో ఇసుక కొరత కారణంగా పనులు లేక పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపేందుకు జనసేన నడుం బిగించింది. ఆ పార్టీ అధినేత పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జనసైనికులు ఆహార శిబిరాలను ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని చిల్లపల్లి కళ్యాణ మండపం దగ్గర డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను పవన్ ప్రారంభించారు. కార్మికులకు స్వయంగా ఆహార పదార్ధాలు వడ్డించారు.

ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండు చేస్తూ పలు చోట్ల కార్మికులు దీక్షలు చేస్తున్నారు.ఇవాళ్టికి రెండోరోజుకు చేరుకుంది. ఇసుక లేకపోవడంతో ఉపాధి కోల్పయి ఆర్థిక ఇబ్బందులతో మరణించిన కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story