రోడ్డు ప్రమాదంలో సింగర్ దుర్మరణం..

రోడ్డు ప్రమాదంలో సింగర్ దుర్మరణం..
X

singer-dies

మరాఠీ సింగర్ గీతా మాలి రోడ్డు ప్రమాదంలో మరణించారు. పలు చిత్రాల్లో పాటలు పాడుతున్న ఆమె సొంత ఆల్బమ్స్ కూడా రూపొందించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమె తన స్వగ్రామం నాసిక్‌కి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న హెచ్‌పీ గ్యాస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గీతా మాలి, ఆమె భర్త తీవ్రగాయాలపాలయ్యారు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన సమీపంలోని షాపూర్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న గీతా మాలి కన్నుమూశారు. ఆమె భర్త పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story