కమెడియన్‌గా అలరించనున్న ఎంపీ శశిథరూర్

X
By - TV5 Telugu |15 Nov 2019 8:08 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కొత్త అవతారం ఎత్తారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే వన్ మైక్ స్టాండ్ అనే కామెడీ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. దీనికి సంబందించి ఓ వీడియోనూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారాయన. ఇందులో థరూర్ తన ఇంగ్లీష్ గురించి జోకులు వేస్తూ అందరిని నవ్వించారు.
ఈ వీడియోను చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు థరూర్ సెన్స్‌ఆఫ్ హ్యూమర్‌ను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. శుక్రవారం నుంచి పూర్తి ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ స్టాండప్ షోలో మొత్తం ఐదుగురు సెలబ్రిటీలు, మరో ఐదుగురు ప్రొఫెషనల్ కమెడియన్స్‌తో పోటీ పడతారు. ఇందులో భాగంగా థరూర్.. ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రాతో జట్టు కట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

