మెగా కోడలు కాల్.. గ్రాఫిక్ డిజైనర్స్ కావాలంటూ..

మెగా కోడలు కాల్.. గ్రాఫిక్ డిజైనర్స్ కావాలంటూ..

upasana

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన ఆరోగ్య సూత్రాలను, ఫిట్ నెస్ రహస్యాలను అభిమానుల కోసం పోస్ట్ చేస్తుంటారు. ఓ హెల్త్ మ్యాగజైన్ నడుపుతున్న ఉపాసన సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. వీటి ద్వారా లక్షల్లో వ్యూస్‌ని ఫాలోయర్లను సంపాదించుకున్నారు. అపోలో లైఫ్ సంస్థ అధినేతగా ఉన్న ఆమె నిరుద్యోగులకు అవకాశం ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఒక సంవత్సరం ప్రొఫెషనల్ అనుభవం ఉండి, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉన్న వారికి మంచి అవకాశం అని తెలిపారు. బీఏ ఫైన్ ఆర్ట్స్ లేదా డిజైన్, గ్రాఫిక్ డిజైన్ చేసి ఉండాలని తెలియజేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, పైన చెప్పిన అర్హతలు ఉన్నవారు upasana@apollolife.comకు రెస్యూమ్, సర్టిఫికెట్ కాపీలు, పోర్ట్‌పోలియో, చేతి రాత ఫోటో తీసి పంపించాలని సూచించారు. ప్రతి బుధవారం అపోలో లైఫ్లో ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తానని ఆమె తెలియజేస్తున్నారు.

Read MoreRead Less
Next Story