బ్రేక్ తొక్కబోయి ఎక్సలేటర్ తొక్కిన డ్రైవర్.. లారీ బీభత్సం


విజయవాడలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. లారీ ఒక్కసారిగా దూసుకురావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన విజయవాడ నగరంలోని గుణదలలో జరిగింది.
మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్.. బ్రేక్ తొక్కబోయి ఎక్సలేటర్‌పై కాలు వేశాడు. దీంతో లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఓ స్కూల్ వ్యాన్ సహా రెండు కార్లు, బైక్‌లపైకి లారీ దూసుకెళ్లింది. ఫలితంగా ఈ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో వాహనదారులకు స్వల్పగాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నారు. డ్రైవర్ మద్యం సేవించి లారీ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

