ఆమెకు రక్షణ ఏది.. తండ్రే కామాంధుడైన వేళ..

నాన్నా పక్కింటి అంకుల్.. అని తండ్రితో చెబుదామంటే అతడి చూపులు కూడా తినేసేలా ఉంటున్నాయి. ఇక ఆమెకు రక్షణ ఏది. తండ్రి, అన్న, అంకుల్.. పేరేదైతేనేం.. వరసలు ఏవైతేనేం.. అమ్మాయి కనబడితే చాలు.. ఆబగా చూస్తున్నాడు.. తండ్రిని కూడా అనుమానించే రోజులు.. కూతురికి పెళ్లైంది. అత్తారింటి వెళ్లింది. చుట్టుపు చూపుగా అల్లుడు లేని సమయంలో కూతురింటికి వెళ్లాడు. బుద్దిగడ్డి తిని కూతురిపైనే కన్నేశాడు. కటకటాలపాలయ్యాడు. కొత్తగూడెంకు చెందిన రమేశ్ (55) 2016లో పట్టణంలోని తన కూతురు ఇంటికి వెళ్లి.. ఆమె భర్తలేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో ఛార్జిషీట‌్‌ను దాఖలు చేశారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో అతడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.30వేల జరిమానా విధిస్తూ జిల్లా మూడో అదనపు జ్యుడీషియల్ న్యాయమూర్తి దేవీమానస తీర్పు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com