కట్నం ఎందుకు మాంగారు.. మీ అమ్మాయే పెద్ద కట్నం..

కట్నం ఎందుకు మాంగారు.. మీ అమ్మాయే పెద్ద కట్నం..
X

rajasthan

మా అల్లుడు ఎంత మంచి వాడు. అమ్మాయి అందంగా ఉన్నా బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తున్నా సంతలో పశువుల బేరంలాగా కట్నం కోసం కంగాళీ చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి అల్లుడు దొరకడం నిజంగా మా అదృష్టం.. మా అమ్మాయి అదృష్టం అని మురిసి పోతున్నారు రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన జైపూర్ వాసి గోవింద్ సింగ్. నగరానికి చెందిన బిఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జితేందర్‌తో కూతురి పెళ్లి కుదిరింది. కట్న కానుకలు ఏమీ వద్దన్నా డబ్బంటే ఎవరికి చేదు అని.. రూ.11 లక్షల నగదుని పళ్లెంలో పెట్టి తీసుకొచ్చారు మామాగారు అల్లుడికి ఇవ్వడానికి. కానీ జితేందర్ మాత్రం కట్నం ఎందుకు మామయ్యా. మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం. ఆమె జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తోంది కదా. మెజిస్ట్రేట్ అయితే అదే తనకు పెద్ద కట్నం అంటూ అల్లుడు తన పెద్ద మనసు చాటుకున్నాడు. మామాగారి నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఈనెల 8న జితేందర్ ఆమెను వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే న్యాయశాస్త్రంలో పీజీ చేసిన ఆమె ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. చదువు, సంస్కారం ఉన్నా చాలినంత కట్నం ఇవ్వలేదని ఒకరు, ఇచ్చింది సరిపోలేదని మరొకరు ఇలా రోజూ ఎక్కడో ఒకచోట కట్నం వేధింపులకు బలవుతున్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం అభినందనీయం.

Next Story