వివాహం చేసుకోనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్‌తో పంజాబ్‌లోని షహీద్ భగత్‌సింగ్ నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ షైని వివాహం నవంబర్ 21న ఢిల్లీలో జరుగనుంది. అనంతరం రెండు రోజుల తరువాత నవంబర్ 23 న రిసెప్షన్ ఉంటుందని షైని కుటంబసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానితులకు వివాహ ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నట్లు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. అంగద్, అదితి ఇద్దరూ 2017 లో ఎమ్మెల్యే అయ్యారు.. వారిద్దరిది రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబాలు.
అంగద్ 2017 లో రాజకీయ రంగప్రవేశం చేసి షాహీద్ భగత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. యువ ఎమ్మెల్యేగా.. నవాన్‌షహర్ సీటును గెలుచుకున్న దివంగత దిల్‌బాగ్ సింగ్ కుటుంబం నుండి వచ్చారు. అదేవిధంగా, 2017 లో 90,000 ఓట్లతో రాయ్ బరేలీ సదర్ సీటును గెలుచుకున్న ఉత్తరప్రదేశ్ విధానసభలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేలలో అదితి సింగ్ ఒకరు. ఆమె తండ్రి అఖిలేష్ కుమార్ సింగ్ ఐదుసార్లు రాయ్ బరేలీకి ప్రాతినిధ్యం వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com