మెగాస్టార్‌ తొలి చిత్రం దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

మెగాస్టార్‌ తొలి చిత్రం దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

suresh

మెగాస్టార్‌ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు రాజ్‌కుమార్‌ దీనస్థితిని అర్ధం చేసుకున్నారు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖులు. ఆయనకు ఆర్థిక సాయం అందించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టారు, చికిత్స చేసుకునేందుకు కనీస స్థోమత లేదు. దాంతో ఆయన దీనగాథ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రాజ్ కుమార్ పరిస్థితిని గురించి తెలుసుకున్నప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి ఆయనకు ఆర్ధిక సహాయం చేశారు. చికిత్స కోసం రూ.41వేలు అందజేశారు.అలాగే ‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేల నగదు అందజేశారు. తార్నాకలో ఉంటున్న దర్శకుడి ఇంటివద్దకు వెళ్లి డబ్బును అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story