భవన నిర్మాణ కార్మికుల నిరాహార దీక్ష భగ్నం

X

తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో భవన నిర్మాణ కార్మికుల నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కార్మికులను అరెస్ట్ చేసి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు. ఇసుక కోరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కుటుంబ పోషణ భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేని వారికి రూ.10వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
