ఆర్టీసీ కార్మికుల సమ్మె: అశ్వత్థామరెడ్డి గ‌ృహనిర్భందం

ఆర్టీసీ కార్మికుల సమ్మె: అశ్వత్థామరెడ్డి గ‌ృహనిర్భందం

tstc

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజు కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు JAC నేతలు ప్రకటించడంతో.. BNరెడ్డి నగర్‌లో జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. గృహనిర్బంధం చేయడం అన్యాయమని అశ్వత్థామ అన్నారు. జేఏసీ నేతల ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.

మరోవైపు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సాముహిక నిరాహార దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు ఎవరూ రాకుండా కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలోకి వెళ్లే అన్ని రహదారులన్నీ అష్ట దిగ్బంధనం చేశారు పోలీసులు. అడిషనల్ సీపీ చౌహన్‌ అక్కడ భద్రతను సమీక్షిస్తున్నారు.

అటు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో.. భువనగిరిలో డిపో ముందు బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. డిపో ముందు బైటాయించి ధర్నాకు దిగారు. కార్మికులకు మద్దతుగా అఖిపలక్ష నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. డిపో ముందు ధర్నా చేస్తున్న కార్మికులు, అఖిలపక్ష నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ధర్నాకు దిగిన 90 మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. 43 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కార్మికులు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story