మీ ఓటు భద్రంగా ఉందో లేదో ఓసారి చెక్ చేస్కోండి ఇలా..

మీ ఓటు భద్రంగా ఉందో లేదో ఓసారి చెక్ చేస్కోండి ఇలా..
X

voter-id

మీ ఓటు మాకే.. మీ ఒక్క ఓటు.. ప్రభుత్వాన్ని మారుస్తుంది.. మీ జీవితాలను మారుస్తుంది.. ఊరించే వాగ్ధానాలెన్ను

న్నా.. దేశ పౌరుడు/పౌరురాలిగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ. నచ్చిన నాయకుడికి ఓటు వేద్దామని పోలింగ్ బూత్‌కి వెళితే పేరుండదు. లేదంటే అన్నీ తప్పులు.. మీరు ఓటు వేయడం కష్టం అంటే ఊసురుమంటూ వెనక్కి తిరిగి రావల్సిన పరిస్థితి. మరి వాటన్నింటికీ చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టినా, చాలా సందర్భాల్లో సరైన విచారణ జరపకుండానే అర్హులైన అభ్యర్థుల పేర్లను కూడా తొలగిస్తున్నారు. అయితే ఈసారి అలాంటి సమస్యలేవీ ఎదురుకాకుండా పక్కగా ఓటరు ధ్రువీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. సెప్టెంబరు 1న ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈ కార్యక్రమంలో ఓటరు ధ్రువీకరణతో పాటు, ఓటరు పేరు, చిరునామాలో తప్పులను సరి చేసుకోవడం, ఫోటోలను మార్చుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటును ధ్రువీకరించుకున్న వ్యక్తుల పేర్లను వారి అనుమతి లేకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. ఓటర్ల జాబితాకు సంబంధించి అప్‌డేట్స్ పంపేందుకు వీలుగా ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను సైతం ఈ కార్యక్రమంలో భాగంగా సేకరిస్తోంది.

బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ తిరిగి ఓటర్లందరి నుంచి గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తున్నారు. పాస్‌పోర్టు/డ్రైవింగ్ లైసెన్స్/ఆధార్/రేషన్ కార్డు/ప్రభుత్వ గుర్తింపు కార్డు/బ్యాంకు పాసు పుస్తకం/రైతు గుర్తింపు కార్డు/పాన్ కార్డు/జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్)లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసే స్మార్టు కార్డు/నల్లా బిల్లు/టెలిఫోన్/విద్యుత్/గ్యాస్ కనెక్షన్ బిల్లుల్లో ఏదైనా ఒకదానికి సంబంధించిన జిరాక్స్ ప్రతిని బీఎల్‌ఓలకు అందజేసి తమ ఓటు హక్కును ధ్రువపరచుకోవచ్చు. ఓటర్ హెల్ప్లైన్ ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ వివరాలను అప్‌లోడ్ చేయడం ద్వారా ధ్రువీకరణ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఓటర్లు నేరుగా తమ ఓటును ధ్రువీకరించుకునే సౌకర్యాన్ని కల్పించింది ఎన్నికల సంఘం. ఇందుకుగాను వెబ్‌సైట్ (https://www.nvsp.in)లో తమ పేరుతో లాగిన్ అకౌంట్‌ను ప్రారంభించి తమ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను జతపరచడంతో పాటు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామాలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు.

Tags

Next Story