మంటగలసిన మానవత్వం.. రోగిని వంతెన కిందపడేసిన వైద్య సిబ్బంది

మంటగలసిన మానవత్వం.. రోగిని వంతెన కిందపడేసిన వైద్య సిబ్బంది

yachakudu

ఒంటిపై బట్టలు కూడా లేకుండా కదలిలేని స్థితిలో ఉన్న యాచకుడికి వైద్యం చేసేందుకు ప్రభుత్వ డాక్టర్లు నిరాకరించారు. అంతటితో అగకుండా వింత రోగంతో ఉన్నాడంటూ అతన్ని వంతెన కింద పడేసి వెళ్లిపోయారు. రోజంతా అక్కడే పడి ఉండడంతో బిచ్చగాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మరణించాడు. మానవత్వానికి మచ్చలా నిలిచిన ఈ హేయమైన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, గూడెంలో చోటు చేసుకుంది.

లక్షెట్టిపేటలోని గోదావరి సమీపంలో ఓ యాచకుడు అనారోగ్యంతో బాధపడడంతో కొందరు యువకులు నాలుగు రోజుల క్రితం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు శుక్రవారం అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అటెండర్ లేడన్న నేపంతో యాచకుడ్ని అదే అంబులెన్స్ లో తిరిగి పంపించారు. దీంతో అతన్ని దండేపల్లి మండలం గూడెంలో ఓ ఖాళీ స్థలంలో పడేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు రోడ్‌పై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు జిల్లా వైద్యాధికారి భీష్మ. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Next Story