మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై తెలుగు యువత నిరసన

మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై తెలుగు యువత నిరసన
X

vamsi

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని.. వల్లభనేని వంశీ వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌ దగ్గర గల అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శనలో తెలుగుయువత భారీగా పాల్గొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. రేపు తమకు ఒక రోజు వస్తుందని హెచ్చరించారు. ఇదేవిధంగా వైసీపీ నేతల వ్యవహారం ఉంటే ప్రజల్లో తిరగడానికి కూడా ఇబ్బంది పడతారని హెచ్చరించారు.

Tags

Next Story