మద్యం మత్తులో నానా హంగామా చేసిన యువతి

మద్యం మత్తులో నానా హంగామా చేసిన యువతి

hulchul

హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. మత్తులో నానా హంగామా సృష్టించింది. అడ్డుకున్న మహిళా ఎస్సైతోపాటు లేడీ కానిస్టేబుల్స్‌పై ఎదురుదాడికి దిగింది. ఈమెను నాగాలాండ్‌కు చెందిన లీసాగా పోలీసులు గుర్తించారు.

బంజారాహిల్స్‌ జహీరానగర్‌లో లీసా మత్తులో పడి ఉండటంతో పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. మత్తులోంచి తేరుకున్న లీసా పోలీసులతో గొడవకు దిగి, పారిపోయేందుకు ప్రయత్నించింది. బండ బూతులు తిడుతూ, పోలీసులను గాయపరిచింది.

కాసేపటి తర్వాత ఆ యుతిని పోలీసులు గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టారు. అప్పుడు ఆమె తన వివరాలను తెలిపింది. తాను మాదాపూర్‌లోని పనిచేస్తున్నట్టు లీసా తెలిపింది. ఆమె డ్రగ్స్‌ తీసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని లేడీ కానిస్టేబుల్స్‌పై ఎదురుదాడికి దిగిందని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story