ఆగ్రా పేరు మార్చే యోచనలో ఆదిత్యనాథ్..

ఆగ్రా పేరు మార్చే యోచనలో ఆదిత్యనాథ్..
X

agra

రాష్ట్రంలో సమస్యలేవీ లేవు.. పేరే పెద్ద సమస్యగా కనబడుతోంది యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కి. అందుకే అర్జంటుగా పేరు మార్చడంపై ప్రపోజల్స్ తీసుకువస్తున్నారు. ఈ మేరకు బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ చరిత్ర విభాగానికి లేఖ రాశారు. మరో పేరు కోసం ఇక్కడి చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ నేతృత్వంలో పరిశోధనలు చేస్తున్నారు. ఆగ్రాకు అగ్రవాన్ అనేపేరు మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ అధికంగా నివసిస్తున్న అగర్వాల్ సమాజం కూడా ఆ పేరును అంగీకరించింది. ఆగ్రానార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత జగన్ ప్రసాద్ గార్గ్ కూడా గతంలో యూపీ ప్రభుత్వానికి ఆగ్రా పేరును అగ్రవాన్‌గా మార్చాలని కోరుతూ లేఖ రాశారు. మహాభారత కాలంలో ఆగ్రా నగరాన్ని అగ్రవాన్, అగ్రబాణ్ అని పిలిచేవారని సుగమ్ ఆనంద్ తెలిపారు. అయితే మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా మారిన ఆగ్రాను చాలా మంది అక్బారాబాద్‌గా పిలుస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక, వాణిజ్య రంగాలకు పేరు పొందిన ప్రదేశం కాబట్టి పేరు మార్పు వ్యవహారంపై మరోసారి పునరాలోచన చేయాలని టూరిస్ట్ గైడ్‌లు కోరుతున్నారు.

Next Story