శివసేన, బీజేపీ ఎడ మొహం పెడ మొహం.. కానీ బాల్ థాక్రేకు..

శివసేన, బీజేపీ ఎడ మొహం పెడ మొహం.. కానీ బాల్ థాక్రేకు..
X

devendra

మహారాష్ట్రలో కొన్నాళ్లుగా హైవోల్టేజ్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. సీఎం సీటు కోసం బీజేపీ- శివసేన తెగదెంపులు చేసుకున్నాయి. శివసేన, ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతు కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో మరాఠ పెద్ద పులి బాల్ థాక్రే వర్థంతి మరాఠ రాజకీయాలకు కేరాఫ్ మారిపోయింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రేను మరాఠా పార్టీలు అన్ని గుర్తు చేసుకున్నాయి. బాల్‌థాక్రే ఏడవ వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా మహారాష్ట్ర నేతలు ఘనంగా నివాళులర్పించారు. పోటీపడి మరీ ప్రశంసలతో ముంచెత్తారు.

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఆయన భార్య రష్మి థాక్రేలు, బాల్ థాక్రే సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, అరవింద్ సావంత్ తదితరులు కూడా పుష్ప గుచ్చాలుంచి నివాళి అర్పించారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సహా పలువురు బీజేపీ నాయకులు కూడా బాలాసాహెబ్‌కు నివాళులు అర్పించారు. ముంబై-శివాజీపార్క్‌లోని థాక్రే సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.

సీఎం పదవి విషయంలో శివసేన, బీజేపీ ఎడ మొహం పెడ మొహంగా మారాయి. ఈ సమయంలో బాల్ థాక్రేకు ఘనంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం ఫడ్నవిస్..బాల్‌ థాకరేను ప్రశంసిస్తూ ట్విటర్ లో వీడియో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు హిందూ హృదయ సామ్రాట్‌ బాల్‌ థాకరే ఏడో వర్ధంతి సందర్భంగా ఆయనకు వేలవేల వందనాలని ప్రశంసిస్తూ మరాఠీలో ట్వీట్‌ చేశారు. అటు ఎన్సీపీ నేత పవార్ కూడా మరాఠా ప్రజల వాణిని, ఆత్మగౌరవాన్ని చాటిన నేత బాలాసాహెబ్ అని, ఆయన రాజకీయాలు కేవలం సామాజిక అంశాల చుట్టూనే తిరిగేవని, బాలాసాహెబ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు అభివాదాలు తెలియజేస్తున్నానని పవార్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags

Next Story