అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది.. ఎందుకైనా మంచిది.. ఓసారి..

అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది.. ఎందుకైనా మంచిది.. ఓసారి..
X

sbi

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ నవంబర్ 1, 2019 నుంచే బ్యాలెన్స్ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. తమ బ్యాంకు అకౌంట్లలో తగినంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కస్టమర్లు భారీ పెనాల్టీకి బాధ్యులు కావల్సి వస్తుంది. సేవింగ్స్ అకౌంట్లలో నెలవారీ కనీస నగదు నిల్వలను నిబంధనల్లో భాగంగా వెయ్యి నుంచి రూ.3 వేలుగా ఫిక్స్ చేసింది. ఈ రూల్ ఒక్కో సిటీలో ఒక్కో విధంగా ఉంటుంది. మెట్రో లేదా సెమీ అర్బన్ బ్రాంచుల్లో అకౌంట్ ఉంటే ఆయా ఖాతాదారులు తమ ఖాతాల్లో నెలకు రూ.3వేల నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ఎవరైతే ఈ మొత్తాన్ని నిల్వ చేయరో వారికి భారీ పెనాల్టీ విధించనుంది ఎస్బీఐ. అదే సెమీ అర్బన్ బ్రాంచ్‌లలో అయితే రూ.2వేలు తప్పక ఉండాలి. రూరల్ బ్రాంచ్‌లలో ఖాతాలలో నెలకు కనీసం వెయ్యి రూపాయలు ఉండేలా చూసుకోవాలి. లేదంటే వీరు కూడా పెనాల్టీ చెల్లించక తప్పదు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్లు, చిన్న మొత్తాల్లో సేవింగ్స్ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ అకౌంట్లు, ప్రభుత్వ ఫైనాన్షియల్ స్కీమ్‌లతో పాటు జన్ దన్ స్కీమ్ సహా ఇతర పథకాలపై తెరిచిన అకౌంట్లపై ఎలాంటి ఛార్జీలు వర్తించవు.

Next Story