పార్లమెంట్‌ మార్చ్‌కు పిలుపునిచ్చిన జేఎన్‌యూ విద్యార్థులు

పార్లమెంట్‌ మార్చ్‌కు పిలుపునిచ్చిన జేఎన్‌యూ విద్యార్థులు
X

jnu

ఢిల్లీలో జేఎన్‌యూ విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. యూనివర్సిటీలో భారీగా పెంచిన ఫీజుల్ని తగ్గించాల్సిందేనంటూ.. వారు పార్లమెంట్‌ మార్చ్‌కు పిలుపునిచ్చారు. విద్యార్థుల మార్చ్‌తో అలర్టయిన పోలీసులు.. క్యాంపస్‌ను చుట్టుముట్టారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి వారిని నిలువరిస్తున్నారు. క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

జేఎన్‌యూలో ఫీజులను భారీగా పెంచారు. హాస్టల్ మాన్యువల్, డ్రెస్ కోడ్‌పైనా నిబంధనలు విధించారు. ఫీజుల పెంపు, డ్రెస్ కోడ్‌ నిబంధనలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు ఒకేసారి 300 శాతం పెంచారని, ఇది దుర్మార్గమని ఆరోపించారు. ఫీజుల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. యూనివర్సిటికి వచ్చిన విద్యార్థుల్లో అత్యధికం పేద విద్యార్థులేనని, అలాంటివాళ్లు భారీ ఫీజులు ఎలా చెల్లించగలరని ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story