భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే ప్రమాణం

X
By - TV5 Telugu |18 Nov 2019 10:55 AM IST

భారతదేశ 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. చీఫ్ జస్టిస్ గా 17నెలల పాటు బాధ్యతలు నిర్వహిస్తారు. 2021 ఏప్రిల్ 23న ఆయన పదవీవిరమణ చేస్తారు. న్యాయకోవిదుడైన జస్టిస్ బోబ్డే పలుకీలక కేసుల్లో తీర్పులు వెలువరించారు. అయోద్య కేసు విచారించిన ధర్మాసనంలోనూ సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకూ పదవిలో ఉన్న రంజన్ గొగోయ్ ఆదివారమే పదవీవిరమణ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

