మనుషుల ప్రాణాలు తీసిన బిన్ లాడెన్ ఏనుగు మృతి


అసోంలో ప్రజలను భయభ్రంతులకు గురిచేస్తూ, పలువురి ప్రాణాలు తీసిన బిన్ లాడెన్ అనే ఏనుగు మృత్యువాత పడింది. అసోం అటవీ శాఖ అధికారులు బంధించిన ఆరు రోజులకే ఏనుగు చనిపోవడం గమనార్షం. ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఏనుగు ఆకస్మిక మరణం అందరినీ విషాదంలో ముంచేసింది.
అసోంలోని గోల్పారా జిల్లా అటవీ ప్రాంతాల్లో సంచరించిన ఈ ఏనుగు. .అక్కడి ప్రజలకు కునుకులేకుండా చేసింది. గ్రామాలపై దాడి చేస్తు ఇప్పటి వరకు ఐదుగురుని చంపేసింది. అర్ధరాత్రి ఇళ్లపై దాడి చేసేది. దీంతో ఈ ఏనుగుకు బిన్ లాడెన్ అనే పేరు పెట్టారు. గ్రామస్థుల ఫిర్యాదుతో ఈ ఏనుగును పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు దాదాపు ఏడాది పాటు శ్రమించారు. ఎట్టకేలకు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా లాడెన్‌ను బంధించారు. అటవీ అధికారుల సంరక్షణలోకి వచ్చాక.. దీనికి కృష్ణగా పేరు మార్చారు. కానీ పట్టుబడిన 6రోజులకే ఏనుగు చనిపోవడం అందరిని కలిచివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

