రమ్య రొమాంటిక్ షూట్..

రమ్య రొమాంటిక్ షూట్..

Ramya-krishna

కళ్లెర్రజేసి శివగామిగా అద్భుతంగా ఆ పాత్రను రక్తికట్టించగలదు.. అదే కళ్లతో బంగార్రాజుని కవ్వించనూ గలదు. నాలుగు పదుల వయసులోనూ నవ నాయికలకు ధీటుగా రమ్యకృష్ణ తన అందంతో, హావభావాలతో సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తాజాగా పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాశ్‌కు జంటగా కేతికా శర్మ నటిస్తున్నారు. గోవాలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్ర సెట్‌లో ఛార్మీతో కలిసి దిగిన ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు రమ్యకష్ణ. పూరీ జగన్నాథ్, నా రాక్షసి ఛార్మితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అని రమ్యకృష్ణ ట్వీట్ చేశారు. కాగా రమ్యకృష్ణ ట్వీట్‌పై స్పందించిన ఛార్మి.. మీరు మన రొమాంటిక్ చిత్రానికి మరింత అందాన్ని తీసుకువచ్చారు. లవ్ యూ అని రాసుకొచ్చింది.

Read MoreRead Less
Next Story