పెద్దల సభకు అభినందనలు: ప్రధాని మోదీ

పెద్దల సభకు అభినందనలు: ప్రధాని మోదీ
X

modiii

రాజ్యసభకు సోమవారం ప్రత్యేక రోజు.. రాజ్యసభ 250వ సెషన్ జరుపుకుంటోంది. దీంతో సభ్యులందరికీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. సభ విశిష్టతను సభ్యులందరికీ వివరించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పెద్దల సభకు అభినందనలు తెలిపారు. రాజ్యసభ గౌరవాన్ని కాపాడడంలో చేయూతనిచ్చిన వారంతా అభినందనీయులే అన్నారు. కాలంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు ఈ సభ కృషి చేసిందన్నారు. పెద్దల సభ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా ప్రజా సేవ చేయాలి అనుకునేవారికి ఇది సరైన వేదిక అన్నారు. డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ రాజస్యభ సభ్యుడిగానే పార్లమెంట్‌కు వచ్చారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

Tags

Next Story