రైతులను వేధించిన వారికి పుట్టగతులు ఉండవు - లోకేష్

వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విధ్వంసంతో ప్రారంభమైన వైసీపీ పాలనలో అరాచకానికే తప్ప.. అభివృద్ధి, సంక్షేమానికి చోటు లేదంటూ విమర్శించారు. టీడీపీ ఓటు వేశారన్న అక్కసుతో ప్రకాశం జిల్లా కోనంకి గ్రామంలో ఎస్సీ రైతులు వారి పొలాల్లోకి వెళ్లకుండా..రోడ్లను తవ్వేశారంటూ మండిపడ్డారు. జగన్ గారు తెచ్చిన స్వర్ణయుగం ఇదేనా అంటూ నిలదీశారు. దేశవ్యాప్తంగా ఉన్న మానవహక్కుల సంఘాలన్ని రాష్ట్రంలో పర్యటించాల్సిన రోజులు వచ్చేశాయని అనిపిస్తోందన్నారు. రైతులను వేధించిన వారికి పుట్టగతులు ఉండవన్న విషయాన్ని జగన్‌గారు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు లోకేష్. సన్నబియ్యంపై ప్రశ్నించినందుకు మంత్రి కొడాలినాని చాలా పరుషపదజాలాన్నివాడటంపైనా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com