నిహారిక నిర్ణయానికి ఓకే చెప్పిన నాన్న, పెదనాన్న..

నిహారిక నిర్ణయానికి ఓకే చెప్పిన నాన్న, పెదనాన్న..

neeharika

మెగా వారసులతో పాటు మెగా వారసురాలు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనేంటో నిరూపించుకోవాలనుకుంది. ప్చ్.. అదృష్టం కలిసి రాలేదు. ఆ మార్కు పని చేయలేదు. సినిమాలు, చింతకాయలు అంటూ టైమ్ వేస్ట్ చేసే బదులు వెబ్ సిరీస్ చేసుకోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చేసింది 'నిహా'. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పేరుతో నిర్మాణ సంస్థను మొదలు పెట్టి వెబ్ సిరీస్ చేస్తున్న నిహా.. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచీ లాంటి సిరీస్‌లను నిర్మించింది. ఇక పూర్తి సమయాన్ని వాటికే కేటాయించాలని అనుకుంటోంది. అదే నిర్ణయాన్ని నాన్న నాగబాబు, పెద నాన్న చిరంజీవితో చెప్పేసరికి వారు కూడా ఓకే చేశారని సమాచారం. ప్రస్తుతం మ్యాడ్ హౌజ్ అనే వెబ్ సిరీస్‌‌లో నటిస్తూ బిజీగా ఉంది.

Read MoreRead Less
Next Story